పుట:మధుర గీతికలు.pdf/694

ఈ పుట ఆమోదించబడ్డది



నిన్నుఁ బోలిన వన్నెలు చిన్నె లొలుకు
సోయగమువాఁడు, చక్కనిచుక్క యతఁడు;
చుక్కగమిలోనఁ దానొక్క చుక్క యగుచు
నున్నవాఁడెమొ చూడుమా యొక్కసారి.

ఉన్నచో వేగ నాతనియొద్ద కీవు
చేరి మెల్లఁగ నడుగుమా చిన్నమాట-
ఇప్పుడైనను మఱి యింక నెప్పుడైన
నిచ్చటికి వాఁడు క్రమ్మఱ వచ్చు నేమొ?

ఇటకు వచ్చుట కతని కనిష్ట మైన
అటకు నన్నైన రప్పించు మంచు ననుము;
వాని కటు చేయ నలవి కా దేని, వాని
పొంత కీ వైనఁ దోడ్కొనిపొమ్ము నన్ను.

ఇంక నొకమాట చెప్పెద, నెల్లి నీవు
విన్నువిధిని విహరించు వేళ, వాని
వెంటఁ గొనిరమ్ము-వాని కే విన్నవింతు;
సమ్ముఖమ్మున రాయబారమ్ము లేల !

59