పుట:మధుర గీతికలు.pdf/693

ఈ పుట ఆమోదించబడ్డది

సందేశము



మేల్మిబంగరురంగుల మిసిమి మించు
వెలుఁగు లీనుచు, నో చిన్ని వేగుఁజుక్క!
ఒంటిగా నేల తిరిగెదు మింటిమీఁద  ?
నిలిచి నాతోడ నొకమాట పలుక వయ్య.

ఒక్కటొకటిగ నీతోడిచుక్క లెల్ల
నోసరిల్లెను,కొలికోడి కూసె, నదిగొ!
తూర్పుదిక్కుల సంజలు తొలకరించె;
ఏల తిరిగెద వీలీల బేలవోలె

కలువ చెలికాఁడు చని యొక్క- గడియ యయ్యె
ఇనుఁడు చనుదెంచు క్షణములో; నింతలోనె
ఏల నెంచితె యాకాశ మెల్ల నొకట?
నిలిచి నా మాటలకు మాఱు పలుక వయ  ?

నాదు ముద్దుల కొమరుండు నన్ను విడిచి
ఏడుమాసము లయ్యెఁ దా నెటకో చనియె,
ఇంత కాలముదనుక నాచెంత రాఁడు;
అతని విడనాడి నే నింక బ్రతుకఁ గలనె

58