పుట:మధుర గీతికలు.pdf/692

ఈ పుట ఆమోదించబడ్డది



నీదు లావణ్యలతికకుఁ బ్రోదివెట్ట
నాలవాలము లీలఁ జెన్నారు చున్న
చిట్టిబొడ్డుకు పట్టంబు గట్ట నెంచి
పట్టఁజాలని తమి ముద్దు పెట్టుకొంటి.

నిదురమబ్బున నట్టిట్టు కదలియాడి
మొలక లేనవ్వు మామీఁదఁ జిలికినావు;
నాదు ముద్దున కదియె సన్మాన మనుచు
ఓలలాడితి హర్ష కల్లోలమందు.

57