పుట:మధుర గీతికలు.pdf/691

ఈ పుట ఆమోదించబడ్డది



మామక స్వాంత కేదార సీమయందు
రాగ బీజంబులను నాటి సాగుసేయ
పూన్చు బంగరుహల మనఁ బోలుపు మీఱు
నీదు నాసిక లూటాడె నాదు మనము.

చుబుకసోపానపంక్తిచే సొబగు మీఱి
చెక్కుటద్దపుఁ గాంతుల జెన్ను మిగిలి
ముద్దుదేవికి పవడంపు గద్దెయైన
చివురు కెమ్మోని నా మదిఁ దవులు కొనియె.

ముద్దునెమ్మోము నిద్దంపుటద్దమునకు
నమరు చక్కని పిడి యన నలరు నీదు
డంబు మీఱిన చిన్ని గడ్డంబు నాదు
నుల్ల మంతయు నుఱ్ఱూత లూఁగఁజేసె

కనులపై వ్రాలి, గండభాగములఁ బ్రాఁకి,
నాసతుద నెక్కి, పెదవుల నాట్యమాడి,
గడ్డమున నిల్చి, చెంగున గంతువై చె
నాదు మానసభృంగంబు నాభిపైకి.

56