పుట:మధుర గీతికలు.pdf/690

ఈ పుట ఆమోదించబడ్డది



లలిత మగు నీదు నెమ్మేనిలతికయందు
అలరుగుత్తులొ యన నొప్పు నంగకములు
మామకోత్సుక మానసమధుకరంబు
నొక్కసారిగ నువ్విళులూరఁ జేసె.

కన్నుదోయియొ, బుగ్గలో, చిన్న ముక్కో,
చివురుపెదవులొ, గడ్డమొ, చిట్టిబొడ్డొ
ఇందు దేనిని ముద్దిడుకొందు ననుచు
నిర్ణయింపఁగలే కట్టె నిలిచియుంటి.

వదనలావణ్య వరసరోపరమునందు
తేలియాడెడు బేడిసమీ లనంగ
చెన్ను మీఱిన నీ వాలుఁగన్నుదోయి
నాదు మానససీమను నాట్యమాడె.

సహజ లావణ్య శృంగార చారుకళకు
అన్యవస్తుల చాయల ననుకరించు
అద్దముల బెళ్కు సాటియే యనుచు నవ్వు
తళుకు చెక్కులు నామదిఁ దాండవించె.

55