పుట:మధుర గీతికలు.pdf/688

ఈ పుట ఆమోదించబడ్డది



వచ్చియును రాని జిలిబిలి పలుకు చేత
తెలిసి తెలియని చిటిపొటి తెలివి చేత
నేర్చి నేర్వని చిన్నారి నేర్పు చేత
ఎలమి న న్నలరించువా రెవ్వరింక?

మొలకనగవులు మొగమున గులకరింప
తళుకుఁ దేనియ పలుకులఁ దొలకరింప
కలికిచూపులు వీనులఁ బలుకరింప
ఎలమి న న్నలరించువా రెవ్వ రింక?

53