పుట:మధుర గీతికలు.pdf/686

ఈ పుట ఆమోదించబడ్డది


'ఎచటి కేగుచు నుంటివి, యేను వత్తు'
ననుచు పరుగున నాచెంత కరుగు దెంచి
చిట్టి చేతులు నా కాలు చుట్టి పెనఁచి
ఎలమిన న్నలరించువా రెవ్వ రింక ?

'వెండిగిన్నియ నుంచి వెన్న బువ్వ'
పసిఁడిదొన్నియ బోసిట పాలు పెరుగు,
ఆరగింపర జాబిల్లి' యనుచు పాడి
ఎలమి న న్నలరించువా రెవ్వ రింక ?

‘ఔర! అబ్బాయితలమీఁద గోరువంక'
చెప్పకుము చెప్పకుము నీవు చిట్టిపాప !
చెప్పితే నీదు కన్నులు చెడు’ నటంచు
ఎలమి న న్నలరించువా రెవ్వ రింక ?

'నన్ను ముట్టకు నామాలనల్ల కాకి!'
అంచు నటునిటు పరుగెత్తి మించువేడ్క
తోడిబాలురతో నాటలాడికొనుచు
ఎలమి నన్నలరించువా రెవ్వరింక ?

51