పుట:మధుర గీతికలు.pdf/685

ఈ పుట ఆమోదించబడ్డది



'కొట్టులో మొన్న కొన్నట్టి గుడ్డపిల్లి
పట్టునే యెల్క ?' నన, 'నేను 'పట్ట' దనగ,
'గుడ్డయెలుక నొ?' యను నీదు గోలతనము
మఱవ శక్యమే యెన్ని జన్మములకైన


లీలలు 2



కమ్మనెయ్యియు బువ్వయు కందిపప్పు
కలిపి గుజ్జుగఁ గావించి కడుపునిండ
గోరుముద్దలఁ దినిపింప నారగించి
ఎలమి న న్నలరించువా రెవ్వ రింక

'పండు లోయమ్మ గుమ్మడిపండు' లనుచు
నెత్తిపై నిన్ను నిడుకొని నేను కేక
నిడఁగ, ‘వెల యంత’ యని యమ్మయడుగ,
"కేరి నవ్వి న న్నలరించువా రెవ్వ రింక ?

నవ్వుటాలకు నినుఁ దల్లి నొవ్వనాడ,
'అమ్మ! నీ పని పట్టింతు' ననుచు నన్నుఁ
జేరి బుడిబుడి కన్నీరు చిందువాఱ
నేడ్చి న న్నలరించువా రెవ్వ రింక ?

50