పుట:మధుర గీతికలు.pdf/683

ఈ పుట ఆమోదించబడ్డది



ఎచటనుండియొ నే నింటి కేగు దేర
తలుపుచాటున నల్లన దాగియుండి
కెరలి దోబూచులాడు టక్కరితనంబు
మఱన శక్యమె యెన్ని జన్మములు కైన?

గాఢముగ నేను నిద్రింప, గడ్డమునకు
నార నంటించి మెల్లన నన్ను లేపి
కులికి యద్దంబు జూపు నీకొంటెతనము
తుఱన శిక్యమె యెన్ని జన్మములకైన

పాన్పుపై నాదు చెంతను బవ్వళించి
బొట్టవ్రేలిని నోటను బెట్టికొనుచు
ఆదమరచుచు నిదురించు నీదు మురుపు
మఱవ శక్యమె యెన్ని జన్మములకైన?

తొట్టిలోపలఁ గూర్చుండఁ బెట్టి నేను
హాళి 'నుయ్యాలొ జంపాలొ' యంచు నూప'
మోదమున నోలలాడెడు నీదులీల
మరవ శక్యమె యెన్ని జన్మములకైన?

48