పుట:మధుర గీతికలు.pdf/682

ఈ పుట ఆమోదించబడ్డది

లీలలు -1



గల్లుగల్లున చిఱుగజ్జె లల్లలాడ
చిట్టి చేతుల సారె కట్టిట్టు త్రిస్పి
విద్దియమ్ములు సేయు నీ ముద్దువగలు
మఱవ శక్యమె యెన్ని జన్మముల కైన?

అల్లనల్లన మెల్లఁగ నడుగు లిడుచు
"వెనుక పాటునఁ జేరి నాకనుల నట్టె
మూసి, 'ఎవ' రని యడుగు నీ ముగుదతనము
మఱవ శక్యమె యెన్ని జన్మముల కైన?

'వచ్చి రెవ్వరొ నీతోడ ముచ్చటింప'
ననుచు వచియింప, నేఁ దటాలునను లేవఁ
జననిఁ జూపించి నవ్వు నీ జాణతనము
మఱవ శక్యమే యెన్మి జన్మముల కైన?

నీదు తలమీద నున్నది యేదో' యనుచు
నుడువ, తడఁబడి నేఁ దల తడని కొనఁగ,
'తడవె దెవ్వరి' ననెడు నీ గడుసుతనము
మఱవ శక్యమె యెన్ని జన్మముల కైన?

47