పుట:మధుర గీతికలు.pdf/680

ఈ పుట ఆమోదించబడ్డది



కన్నుఁ గొలకులు రెండును గలియకుండ
నడుమ ముక్కను సేతువు నలువ కట్టి
పైకి పొరలకయుండ నేర్పఱచినట్టి
పోతగట్టులొ యన కనుబొమ్మ లలరు.

రమ్యుభవదీయ ముఖస భారంగ మందు
కొలుపు దీరిచి మారుండు కూరుచుండి
డంబు మీఱిన సింహాసనం బనంగ
నీదు నాసిక విలసిల్లు నిండుజిగిని.

మంజులం బగు నీ కంఠ పంజర మున
గోరువంకయొ చిలుకయొ కోకిలంబో
కాపురము సేయుఁ గాబోలు, కాకయున్న
అలరునే యింత మధురిమ పలుకులందు?

మోవి పవడంబు, గోరులు ముత్తియములు,
కురులు నీలాలు, కెంపులు చరణయుగళి,
పల్లువరుసలు రవ్వలు; పద్మభవుఁడు,
నిన్ను నిర్మించెఁ నిక్కంబు నిఖలమణుల,

45