పుట:మధుర గీతికలు.pdf/679

ఈ పుట ఆమోదించబడ్డది

సో య గ ము




నిండుచంద్రుండు నీముఖమండలంబు,
కందు ముంగురు, లుదయరాగంబు మోవి,
అమలచంద్రిక మందహాసాంకరంబు;
అహహ! నీ ముఖంబు సుధాకరాత్మకంబు.

వదనలావణ్య సరసిలోఁ గదలియాడు
వాలుమీనులో యన నొప్పు వాలుకనులు,
నురువులో యన నలరారుఁ జిఱునగవులు
విమల శైవాలమో యన వెలయు గురులు.

నిగనిగలు దేఱు నిద్దంపు నీలమణులు
నట్టనడుమను, "కెంపులు తుట్టతుదను
చెక్కి తాపిన ముత్తెంపుఁజిప్ప లనఁగ
చెన్ను మీ ఱెడి నీ వాలుఁగన్ను దోయి.

కలువఱేకులు మెఱుఁగులు గండుమీలు
నీడు రామికి, కనులతో జోడు గూర్ప
తమ్మిపువ్వులఁ గల్పించె దమ్మిచూలి;
పుట్టనిలు పెద్ద సేయరె యెట్టివారు ?

44