పుట:మధుర గీతికలు.pdf/677

ఈ పుట ఆమోదించబడ్డది



నీదు నవ్వులు నిండు వెన్నెలలు,నీదు
శీలసంపద భూషణ శ్రేణి, నీదు
తళుకు నిద్దంపు సిగ్గు దొంతరలు తలఁప
పరమసౌభాగ్యశుభపరంపరలు నాకు.

ఈవు కలకల నవ్వితి వేని, నాకు
పండు వెన్నెల జగమెల్ల నిండినట్లు;
ఈవు వలవల యేడ్చితి వేని, నాకు
చిమ్మచీఁకటి జగ మెల్లఁ గ్రమ్మినట్లు.

విమల భవదీయ గుణవర్ణనములఁ గాని
చిత్త మరగదు తదితర చింతనముల;
రమ్య మగు నీదు వదనదర్శమునఁ గాని
దృష్టి నిగుడదు తదితర దృశ్యములకు.

ఎట్లు మ్రుచ్చిలితివొ నాదు హృదయ మీవు?
లేఁతనవ్వుల మొలకలచేతఁ గాదు,
చెలువు గులికెడు పలుకులు చేతఁ గాదు,
సిరుల నీనెడు నునుసిగ్గుచేత నేమొ ?

42