పుట:మధుర గీతికలు.pdf/674

ఈ పుట ఆమోదించబడ్డది


భంగుర బగు నిహలోక బంధ ముడిపి
నిత్యమైనట్టి నీదు సాన్నిధ్యమునకు
వానిఁ గొనియుంటి; వందుల కేను వగవ
వానితో నన్నుఁ గొనకుంట కేను వగతు.

వానిఁ గొన నీకు మన సయ్యేఁ గానఁ గొంటి,
వందు కేమందు? నక్కటా! యతని విడిచి
యుండఁగా నోప, నను వానియండఁ జేర్పు,
తండ్రిబిడ్డల నెడసేయు దగునె నీకు.

ఎప్పు డేరీతి నెవ్వరి కేది హితమొ,
అప్పుడారీతి వారల కది యొనర్తు;
వట్లు చేసితి , విటు సేయ వైతి వనుచు
నింద చేయుదు రజ్ఞులై నిన్ను నరులు.

దుఃఖమూలంబు, నత్యంత దుస్సహంబు,
దుర్వ్యథాభాజనంబును, దుర్భరంబు
నైన మైహిక బాధల మానఁ జేసి
పరమపద మిమ్ము నా కూర్మిపట్టి కీశ!

39