పుట:మధుర గీతికలు.pdf/672

ఈ పుట ఆమోదించబడ్డది



నిఖిలపాపంబులకు నెల్ల నిలయమైన
యిహసుఖంబుల నే నింక నిచ్చగింప;
పరమపదమైన నీ పాదపంకజంబు
చెంతఁ జేరిచి నన్ను రక్షింపు మీశ!

ఘోరసంసార సాగరోత్తారణంబు,
భ క్తజన సంతతానంద భద్రకరము,
అవ్యయానంద మోక్ష దాయకము నైన
నీ పదధ్యాన మాత్మలో నిలువ నీవె?

ఆత్మజవియోగ గాఢదుఃఖాగ్నిఁ గ్రాఁగి
స్వచ్ఛమైనట్టి మామక స్వాంత మిదిగో !
ధార గట్టెడి కన్నీట ధారవోసి
అర్పణ మొనర్తుఁ, గైకొనుమయ్య దేవ !

37