పుట:మధుర గీతికలు.pdf/671

ఈ పుట ఆమోదించబడ్డది



ఏఁగె నలువది మూడేడు, లింతదనుక
కష్టమువలె కాని యొక్క సౌఖ్యం బెఱుంగ,
ఉన్నయాసయు నేఁటితో నూడె; నింక
చేర్చుకొన వయ్య నన్ను నీ చెంత దేవ !

చిత్తమునయందె కోర్కులు జీర్ణమయ్యె,
జీవితం బన్న నెంతయు నేవ పుట్టె
ఎల్లయాసలు కడ తేఱె; నింక నీదు
దివ్యపాదాబ్దయుగళియె దిక్కు నాకు.

హేయసంసార జలధిలో నీఁది యీఁది
మునిఁగి తబ్బిబ్బువడి తలమున్క లైతి,
చాలు సుఖములు, విసిగి వేసరితి; నింక
నీదు పాదారవింద సన్నిధికిఁ గొనుము.

దురిత తాపత్రయాభీల దుర్నివార
ఘోర సంసారజలధిలోఁ గూలియుంటి,
కరుణ దరిఁజేర్చి న న్నొగి గావుమయ్య
దిక్కు నీ వని నమ్మితి దేవ దేవ !

36