పుట:మధుర గీతికలు.pdf/670

ఈ పుట ఆమోదించబడ్డది

ఆ త్మ స మ ర్ప ణ ము



నిన్ను భ క్తిని గొలువనొ ? నెమ్మనమును
నీవె దిక్కని నమ్మనొ? నిన్ను విడిచి
పరుల సేవించినాఁడనొ? పరమపురుష!
ఏల నన్నిట్టి కష్టంబు పాలు సేయ?

ఇలను జన్మించినది మొద లింతదనుక
గడపితిని పొద్దు పరహిత కార్యములకు,
సలిపితిని శక్తి కొలదిని సాధు సేవ;
ఏల నన్నిట్టి కష్టంబు పాలు సేయ?

ఆలు పేరిటి గుదికఱ్ఱ నఱుత వ్రేల్చి,
బిడ్డ లనియెడి ముకుతాడు బిగియఁ గూర్చి,
ఘోరసంసార మను పెద్ద గుంజఁ జేర్చి
కట్టితివి నన్ను నట్టిట్టు కదలకుండ.

పుట్టి రేడ్గురు పుత్రికల్ పుత్రు లందు
కట్ట! నలువుర నీపొట్టఁ బెట్టి కొంటి;
వున్న మువ్వుర నైన నాకుండ నిచ్చి
ఆయురారోగ్యవంతులఁ జేయు మయ్య !

35