పుట:మధుర గీతికలు.pdf/668

ఈ పుట ఆమోదించబడ్డది


నీదు పూనిక లెల్లను నిష్ఫలములు,
నిన్న చూచినవారలు నేఁడు లేరు;
సుతు లటంచును సతి యంచు హితు లటంచు,
విఱ్ఱవీఁగెద వేటికే వెఱ్ఱిమనస !

ఏల తిరిగెదు చిత్తమా! బేల నగుచు
కాలు కాలిన పిల్లిని బోలె నీవు ?
వమ్ములై చెడె నీ ప్రయత్నమ్ము లెల్ల;
విసిగి వేసారితివి, యింక విశ్రమింపు.

33