పుట:మధుర గీతికలు.pdf/665

ఈ పుట ఆమోదించబడ్డది

మోక్షము



తెలియఁ జాలక పక్షులు వలలఁ జిక్కు.,
ఎఱుఁగ నేరక మిడుత తా నుఱుకుఁ జిచ్చు,
దురితభూయిష్ట మంచుఁ దా నెఱిఁగి యెరిగి,
కూలు సంసార వార్ధిలో కూళనరుఁడు.

అడరి ముదిమియు రోగంబు నతిశయింప
చీకి దేహంబు శిధిలంబు గాకమున్న
బుధుఁడు సాధింపఁగా దగు ముక్తిపథము ?
ఇల్లు కాలంగ నుయి త్రవ్వఁ జెల్లు నొక్కొ?

అరయ దేహము రథ, మింద్రియములు హరులు,
ఆత్మ పేరిటి రథికుఁ డా యశ్వచయము
ధైర్య మనియెడు రజ్జులఁ దగఁ గుదించి,
వెరవుతోఁబట్టి, మోక్షంబు తెరువుగాంచు.

హేయసంసారసుఖము పై నేవ పుట్ట,
విషయవాంఛల విడనాడి, విపినమందు
తపము సేయుచు నీశ్వర ధ్యానములను
పొద్దుపుచ్చెడివారెంత పుణ్యు లౌర!

30