పుట:మధుర గీతికలు.pdf/661

ఈ పుట ఆమోదించబడ్డది


నీ కటాక్షంబు లెననిపై నిగుడు, వాఁడు
పట్టినది యెల్ల వట్టి నిప్పచ్చరంబు,
కాంచినది యెల్ల నొపుడు బగ్గంపుపాడు,
తెలఁచినది యెల్ల సర్వమంగళము మంద !

ఈవు జనులకు నొక్కెడ హితము గూర్తు
వందు రదియు మఱింత యనర్థమునకె;
ఒయ్యనొయ్యన నెక్కించి, యొక్క పెట్ట
కూలద్రోతువు వారిఁ బాతాళమునకు,

గ్రహములం దెల్ల నతి నీచగ్రహమ వీవు,
వాసరంబుల నధమ౦పు వాసరమవు;
నీకు మ్రొక్కెద నాజోలి రాక యుండ,
చమురుకాళ్ళయ్య ! దౌర్భాగ్య చక్రవర్తి !

26