పుట:మధుర గీతికలు.pdf/660

ఈ పుట ఆమోదించబడ్డది

శ ని నిం ద


ఆది దేవుని కడుపున నవతరించి
నరక సన్నిభుఁడైన యా నరకుభంగి,
భువన బాంధవు కడుపునఁ బుట్టియైన
నైచ్యమును మాన వీవు శనైశ్చరుండ !

చండమార్తాండు కూర్మిపుత్రుండ వగుట,
దండధరునకు ముద్దుతమ్ముండ వగుట,
కలుగునే నీకు నొక్కింత కనికరంబు ?
మండుచిచ్చునఁ బుట్టునే మంచుముద్ద!

నీవు కడగంటఁ జూచిన నిఖిలజగము
ధ్వంసపారాయణంబును దగ్ధపటలి,
నీవు చేపట్టినది యెల్ల నిష్ఫలంబు;
ఇనుపగజ్జెల తండ్రి! శనీశ్వరుండ !

ఈవు కన్నెత్తి చూడవ యేని, నరుఁడు
అఖిల సౌభాగ్యసంపద లనుభవించు;
ఈవు కన్నెత్తి చూచితివేని, నరుఁడు
బగ్గు మని మండి నిలువున బుగ్గి యగును.

25