పుట:మధుర గీతికలు.pdf/657

ఈ పుట ఆమోదించబడ్డది



కొఱవితోఁ గాల్చినట్టులు, సురియ వెట్టి
వ్రచ్చినట్టులు; కొఱ్ఱును గ్రుచ్చినట్లు.
కఱకుఱంపానఁ గోసినకరణి, నాదు
గుండియలు బగ్గుబగ్గున మండుచుండె.

తనయుఁ బేర్వెట్టి పిలువఁగఁ దగ దటంచు
నోరినిండఁగ నీ పేరు నుడువ నైతి;
అయ! యెలుఁగెత్తి 'కామరాజా' యటంచు
నుచ్చరించుచుఁ బలవించుచుంటి నేఁడు.

కన్నులారంగ ప్రతిమను గాంచి యైన
కొంత యేనియు సూఱట కాంతు నంచుఁ
నీదుపటమును నాచెంత నిలిపికొనఁగ,
ఊఱటకు మాఱు జనియించే నారటంబు.

22