పుట:మధుర గీతికలు.pdf/654

ఈ పుట ఆమోదించబడ్డది

విలాసము



'ఎచటి కేఁగిన ననుఁ జూచి యెుల్లవారు
పిలిచి తద్దయు ప్రీతితోఁ బలుకరించి
ముద్దు గొనియెద రిది యేమి సోద్దె?, మనుచు
సుద్దులాడవె తల్లితో ముద్దుకుఱ్ఱ!

‘బట్ట కొలిచెద రమ్మని కుట్టువాఁడు
చేయివైచెను బుగ్గపై, చిత్ర మమ్మ!
కాలు సేతులు కొలుతురు కాని, బుగ్గ
కొలుతురే' యని తల్లితోఁ బలుక లేదె?

“అంగడికి నేగి లడ్డు కొనంగఁబోవ,
‘వద్దు నీ డబ్బు, నాకొక్క ముద్దు నిమ్ము,
లడ్డు ని’ త్తనె, వాఁ డెంత దొడ్డవాఁడే ?
అయ్య! యిది యేటి విడ్డూర ?" మనుచు ననవె?

‘ఎవఁడవుర నీవు? నాయింటి కేల వచ్చి '
తనుచు నీ తాత పలుక, 'నీ మనుమఁడ సుమి !
అసలుకంటెను వడ్డియే సిస' లటంచు
పలుకుదువు కాదె! ఎంత నేర్పరివి నీవు ?

19