పుట:మధుర గీతికలు.pdf/653

ఈ పుట ఆమోదించబడ్డది

గుణవర్ణనము


చిన్ని కృష్ణుని లీలల 'సినిమ' యందు
చూచి, కృష్ణుని పెనుబాము చుట్టి కఱప,
గ్రుడ్ల నిండను కన్నీరు గ్రుక్కికొనుచు
గోలు మని యేడ్చితివి; యెంత జాలి నీకు?

అమ్మ రామాయణము చెప్ప నాలకించి
సీతశోకము విన లేక చెవులు మూసి
కొంచు, 'అమ్మరో! ఇంక చాలించు మమ్మ!'
అంచుఁ బలికతి; వెంత దయార్ద్రమతివొ?

'ఎన్నడును మామ మనయింటి కేని రాఁడు,
మనల నేటికీ వారింట మనకు తల్లి!'
అంచు మనయింటి కమ్మను గొంచు రావె ?
ఎట్టి యభిమాన మమరెరా చిట్టినాఁడె?

నీదుబుద్ధియు వివయంబు నెనరు జూచి
ఏడ నావంటి ధన్యుండు లేఁ డటంచు
పొంగితిని; నేఁ డెచట! నన్నుఁ బోలినట్టి
మందభాగ్యుఁడు లేఁడని కుందుచుంటి.

18