పుట:మధుర గీతికలు.pdf/650

ఈ పుట ఆమోదించబడ్డది


నేను నీవును జనుచుండ, నిన్ను ముందు
పలుకరింపక; నాతోడఁ బలుక రెపుడు
తోడినెచ్చెలు;'లక్కటా! నేఁ డిదేమి
వెడలుచున్నారు నను జూచి వెల్లఁబోయి?

ఏడకేగిన, నా తోడునీడ వగుచు
నాదు చూపుడు వ్రేలిని నాదుకొనుచు
నేగుచుందువు దవ్వెంతయేని గాని;
నేఁడు నా వెంట రా వేమి నీవు తండ్రి?

ఎపుడు గ్రంథాలయంబున కేను జనీన,
తోడ వత్తువు గోవుతో దూడ వోలె;
నేఁడు పోవుచునుంటి; నాతోడఁ గలసి
ఈవు రా వేమి ? పితృభక్తి యెందుఁబోయె?

ప్రతిదినంబును నిద్రపోవకయ ముందు,
‘దండ మిదె నాన్న ! అమ్మరో దండ మిదిగో!-
దండ, మన్నయ్య! అక్కయ్య దండ!' మనుచు
దండ గ్రుత్తువు, నేఁ డేది దండకంబు ?

15