పుట:మధుర గీతికలు.pdf/646

ఈ పుట ఆమోదించబడ్డది

వియోగము


ఈవు నవ్విన నవ్వుదు, ఏడ్వ నేడు,
ఆడ నాడుదు, పాడిన పాడు చుందు,
అకట! నీతోడిదే లోక మనుచు నుండి;
తోడికొన వేల నున్న నీతోడ నేఁడు?

కాంక్ష నవమాసములు మోసి కాంచి పెంచి
ఎవుడు నీ కేమి యాపద లెసఁగునొ యని
కంట వత్తిడుకొని సదా కాచియుండు
అనుఁగుతల్లిని విడనాడ న్యాయ మగునె?

ఏను నమ్మయు నీపయి నెన్నఁ డైన
కినుక వహియించి యుందుము; కనులుగప్పి
కొనుచు నెప్పుడు ని న్నెంతో కొండసేయు
నీదు అమ్మమ్మపై నైన నెనరు లేదె?

మించు వేడుకతో నొక్కకంచమందె
బువ్వ గుడుచుచు, నొక సెజ్జఁ బవ్వళించి,
కూడిమాడుచు నీతోడ నాడి పాడు
అన్న యక్కల నేనియు నరయ వలదె?

11