పుట:మధుర గీతికలు.pdf/645

ఈ పుట ఆమోదించబడ్డది


నేను నిలిపిన పుస్తక నిలయమందు
నీవు నా పేరు స్థిరముగ నిలిపెదవని
యెంచితిని గాని, నీ పేరె యేను నిలువ
వలసివచ్చు నటంచును దలంప నైతి.

ఎంత సుకృతాత్ము లగువారి కైనఁ గాని
ధర ననాయాస మరణంబు దొరకు టరిది;
ఎట్టి ధన్యుండవో నీవు, గిట్టు వేళ
ఉస్సురని యైన నా యాస మొంద లేదు.

ప్రీతి లాలించి నినుఁ జేర బిలుచువారి
చెంత కేనియుఁ జేరంగ సిగ్గువడెదు;
ఎపుడు ముక్కు మొగంబును నెఱు గనట్టి
వింతలోకము నెటు లొంటి వెళ్ళి తయ్య?

మర్త్యులకె కాదు, దేవతా మండలికిని
మండనాయమానంబుగ నుండువాఁడు
అరుగు చున్నాఁడు మీ చెంత కమరులార!
లెండు మీ పుణ్య మంతయు పండె నేఁడు

10