పుట:మధుర గీతికలు.pdf/643

ఈ పుట ఆమోదించబడ్డది


పలకపై నేవొ యక్షరంబులను గిలికి
'అయ్య! నావ్రాతయిదే పూర్తి యయ్యెను' నంచు
పలికితివి రేపు రోగంబు వచ్చు ననఁగ;
అకట! ఆమాట సత్యంబ యగుచు; దాఁకె.

'పిలుప రెప్పుడు నోరార పేరు పెట్టి,
'పాప' యని పిల్తు రది యేమిపాప మొక్కొ?
కాను పాపఁడ, పెద్దలఁ గలసినాఁడ'
అనుచుఁ బలికెద, వది నిజం బయ్యె నేఁడు.

వెనుక మన పెద్ద లందఱు వేఱువడఁగ
కనఁగఁ జాలక నీ తాత చనియె దివికి;
నేఁడు నీ నాన్న, పెదనాన్న వీడిపోవ
కనులఁ గనఁజాల నని నీవు చనితె దివికి ?

వచ్చు శ్రీరామనవమికి వైభవమున
బాలకృష్ణుని రథముపై లీల నునిచి
పండుగ నొనర్ప నుంటివి నిండువేడ్క;
అకట ! పండుగ దండుగ యయ్యె నొక్కొ?

8