పుట:మధుర గీతికలు.pdf/642

ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరాభ్యాస మొనరించినపుడు కవులు
నీవు చిరజీవి వగు దంచు దీవెనలను
బలికి, రవ్వియు నిన్నుఁ గాపాడఁ వయ్యె;
నాదు దౌర్భాగ్యఫల మది కాదె యకట!

ఎచట నేగుడి నే దేవుఁ డెదురుపడిన,
‘ఆయిరాకుండ నను గావు మయ్య' యంచు
మ్రొక్కుచుందువు, వారిలో నొక్కఁడైన
అడ్డుపడి నిన్ను గాపాడఁ డయ్యె నయ్యొ!

ఏమ మును నీకు ప్రతిమ తీయించినపుడు,
చూపు మింటికి బఱపి కూర్చుండినావు;
మింటిచూపులె కాని, యీ మంటిచూపు
తిరము కాదని యీలీలఁ దెలిపినావ ?

మృత్యుసమయంబు దాపింప మేను మఱచి
‘ఇంటికేగుచునున్నాఁడ’ వంటి వయ్య!
కలవరిం పని యప్పుడు తలఁచికొంటి
అకట! యిప్పుడు తెలియంగ నయ్యె నిజము

7