పుట:మధుర గీతికలు.pdf/639

ఈ పుట ఆమోదించబడ్డది



బాలపాపలపాలి యకాలమృత్యు
వగుచు, వారిని బలిమిమై నట్టె పట్టి
కుత్తుకలు నొక్కి త్రుటిలోనఁ గూల్తు వౌర!
పాపినివి కావె యో బాలపాపచిన్నె!

బౌర ! స్థిరవార మని నీకు పేరె కాని,
యింత యస్థిర వాసర మెందు లేదు;
మందుఁ డై నట్టి శని నిన్ను పొందియుండ,
మందునకు నైన నీయందు మంచి యున్నె?

కృత్తికా ! నీవు కుత్తుకల్ కత్తిరింతు,
వగుటఁ జేసియె యానామ మమరె నీకు;
కానిచో నుక్కు గుండును బోనివాని
తునుకలుగఁ ద్రుంతువే యొక్క త్రుటికలోనె?

నాగుబాములు విఘ్న వినాయకుండు
నధిపతులు గాన సహజంబు లయ్యె నీకు
పరుల నొంచుట బన్నంబు పఱచుటయును;
తిథివె? మృత్యు దేవత కీ వతిథివి చవుతి!

4