పుట:మధుర గీతికలు.pdf/638

ఈ పుట ఆమోదించబడ్డది



ఎల్లవారికి నల్లారుబెల్ల మగుచు,
మురిపములు చూపి ముద్దులు మూటగట్టు
ముద్దుబుడుతఁడు నీకును ముద్దు గొలుప,
ముచ్చ టయ్యెనె మృత్యువా! మ్రుచ్చిలింప

ఆటలం దైన ననృతంబు లాడఁ బోఁడు,
చిన్ని చీమల నేని హింసింప లేఁడు,
అన్నెమును పున్నె మెఱుఁగఁడు, అట్టివాని
చప్పరించితె మృత్యువా। చుప్పనాతి!

అకట! ముకుపచ్చలారని యట్టి నిసుఁగు
నంత మొందింప నీశక్య మయ్యెఁగాని,
అట్టి మంగళాకారుని, అమలగుణుని
మగుడఁ బుట్టింప నీశక్య మగునె మిత్తి!

సాధుజనముల కెగ్గులు సలిసినానొ?
తండ్రిబిడ్డల కెడ బాటు తలఁచినానొ?
ఒరుల సంపదఁ దిలకించి యోర్వలేనొ?
కుటిలదైవమ! నన్నేల కుతిలపఱువ?

3