పుట:మధుర గీతికలు.pdf/637

ఈ పుట ఆమోదించబడ్డది



క్రొత్త వత్సర మరుదేరఁ, గోర్కె దీఱ
బూరెముక్కలఁ గడుపార నారగించి,
వేడు కలరంగు నా బాలుఁ డాడుకొనుచు
పొంగుచుండఁగ, క్రోధనా ! మ్రింగినావె ?

క్రోధనా! నీకు నామీద క్రోధ మేల?
అడుగు పెట్టితివో లేదో యింతలోన
ముద్దుకొమరుని తొలి వెచ్చముద్ద గాఁగ
గుటుకు మని మ్రింగి తెంతటి కుటిలమతివి?

పులుసు కారము వర్జించి, ఫలము పాలు
కుడిచి, మునివృత్తి నిష్టమె గడపుచున్న
కనులు దెఱువని పసిపాపఁ బెఁనగి చంప
చెనటికాలమ! నీ కెట్లు చేతులాడె?

ఏను సౌఖ్యంబు నొందుట గాన లేక
నీకుఁ గనుగుఁట్టె గాఁబోలు, గాక యున్న
మంటఁ గలుపుదువే పండువంటి సుతుని?
చెనఁటికాలమ! నీ కేమి చేటు మూఁడె ?

2