పుట:మధుర గీతికలు.pdf/636

ఈ పుట ఆమోదించబడ్డది

కాలగతి





ఎల్లజనములు కడువేడ్క నుల్లసిల్ల
చైత్ర మిదె వచ్చె, సంతతోత్సవముహెచ్చె;
మొగ్గ లన్నియు విచ్చె, నామొగ్గ యకట!
మూడుప్రొద్దులలో నిట్టె మాడిపోయె.

చనియె దుష్ట సంవత్సర సప్తకంబు;
మంచి వత్సర మరుదెంచె నంచు నుండ;
పిట్టపిడుగున నక్కటా! యుట్టిపడుచు
క్రోధసా! వచ్చి నా కొంపఁ గూల్చినావె?

నీదు నామముచేతనె నీగుణంబు
బోధపడుచుండ, నీయందు సాధుగుణము
వెలయు ననుకొంట క్రోధనా! వెఱ్ఱి కాదె?
తులసి పుట్టునె గంజాయి తోటయందు?

1