పుట:మధుర గీతికలు.pdf/633

ఈ పుట ఆమోదించబడ్డది

vi

ముతోఁ బ్రోదిచేసి 'పాపాయి' యను చిన్ని కావ్యరూపమునకుఁ దెచ్చినారు.

తన భావనలోఁ దాను కరగి యితరులనుసైతము కరగు నట్లు చేయఁగల కొలఁదిమంది కవులలోఁ గృష్ణరావుగా రొకరు. వీరి కవితలను జదువునపు డాంగ్ల కవి 'వర్డ్సువర్తు' జ్ఞప్తికి రాకమానఁడు. వియోగ సంజనిత క్లేశమును కవి రమణీయ కవితాస్ఫూర్తితోఁ చెప్పఁ గల్గును. ఇతరు లట్లు చెప్ప లేరు. ఇదియే కవిలోని ప్రత్యేకత !!

ఇంతకుము న్నే యీ 'పాపాయి' కృతి యశేషాంధ్రుల మెప్పందినది. కవిగారి పుత్త్రీమణి 'విదూషీమణి' 'కళాప్రపూర్ణ' శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారి కోర్కెపై నీ కావ్యమణిని మఱల ముద్రింపించి సారస్వత లోకమునకు మహోపకారము గావించిన 'వదాన్యులు' 'కళాసాహిత్య ప్రియులు 'శ్రీ గ్రంథి సుబ్రహ్మణ్య శ్రేష్ఠిగారు (రాజమహేంద్రవరము) నిజముగా అభినందనీయులు.

'సువర్ణగండపెండేర విభూషిత

'కవితావాచస్పతి' 'భాషాప్రవీణ'

చేబోలు చిన్మయబ్రహ్మకవి, ఎం. ఏ.

రాజమహేంద్రవరము, 22 - 3 - 82