పుట:మధుర గీతికలు.pdf/632

ఈ పుట ఆమోదించబడ్డది

మున్నుడి

కరుణారస పరిప్లావిత హృదయమునుండియే యు త్తమ కవిత ఆవిర్భవించు ననుటకు 'ఆదికవి' వాల్మీకిరామాయణమే తార్కాణము. ఆలంకారికులు శృంగారము రసరాజమన్నను 'కరుణారసపోషణము' ఉదాత్తకవితాలక్షణముగాఁ బేర్కొనవలసియున్నది. 'భవభూతి, ఉత్తరరామాయణప్రాశస్త్యమున కిదియే కారణమని పండితుల అభిప్రాయము.

'సంస్కరణాభిలాషి'గా 'మధురకవి'గా శ్రీ నాళము కృష్ణారావుగారు తీఁదీయని పదములతో మనోహర భావనలతోఁ దేటగీతులలో నాటవెలఁదులలోఁ బెక్కు చిన్నారి మధురకృతులను రచించి యాంధ్రుల యాదరాభిమానములను జూఱగొన్నారు. వీరి కబ్బముల పేర్లెంత మృదుమధురములో, వీరి హృదయస్థితియు నట్టి దని చెప్పవచ్చును.

విషయము చిన్నదైనను దానిని బావించుటలోను కవితా బంధముగా మలచుటలోను కవి 'ఘునత' స్పష్టముగాఁ గాన వచ్చుచుండును. తల్లిబిడ్డల, తండ్రికొడుకుల అనురాగాతిశయములు నిరుపమానములైనవి. 'అందాలరాశి' గుణవంతుఁడు నగు 'పాపాయి' అను కమారుఁడు అయిదాఱేండ్లయినను నిండక మునుపే మరణించుటతో మనకవిగారు చాల పరితపించినారు. మంచి భావుకులు, కవులు నగుటచే వీ రంతకాల మతనితోఁ గడపిన సన్ని వేశములను మధుర కవితాశక్తి,తోఁ గరుణారస