పుట:మధుర గీతికలు.pdf/627

ఈ పుట ఆమోదించబడ్డది



'పేదరాలినో, దాసీవో యౌదుగాక !
ఈవె కేరళరాణివి యింకమీద'
అనుచు నతఁ డామె బిగికౌఁగిటను గదించి,
మోవి మోవిని గీలించి ముద్దు గొనియె.

జరిగె వారికి మఱునాఁడె పరిణయంబు;
ఎవరి రాజ్యమొ నేఁటికి నెఱుఁగ రెవరు,
రాజ్ఞి ఆమెయె కేరళరాజ్యరమకు
అనుచు భావించుచుండిరి అఖిలజనులు.

72