పుట:మధుర గీతికలు.pdf/626

ఈ పుట ఆమోదించబడ్డది


దాసీవా నీవు ? కేరళదేశరాజ్య
రమ్య సామ్రాజ్య సౌభాగ్యరాశి వీవు;
విమల భాసుర కాంతిచే విశ్వ మెల్ల
భాసిలగఁ జేయు తేజోవికాసి వీవు

చిఱుతపాయమునుండి కాంక్షించుచున్న
వాంఛ లీడేరు తరుణంబు వచ్చె నంచు
ఉల్లమున నెంతొ యువ్విళు లూరుచుండ.
అకట : నీ విట్లు చేయంగ న్యాయ మగునె ?”

'తగునె నీ విట్టు లాడంగ ధరణివిభుడ !
రాణి నేఁ గాను, నిఱుపేదరాలు సుమ్మి'
అనుచు నే నెంత చెప్పిన, వినవ దేమి ?'
అంచు జరిగిన దెల్ల విన్పించె నంత.

“నీవు చెప్పిన మాటలే నిక్క మేని,
నేను రాజైన, రాణివి నీవు గాక,
ఏల యగుదువు పేదవు : చాలు చాలు-
ఇట్టి మాటల నీ వింక కట్టిపెట్టు.

71