పుట:మధుర గీతికలు.pdf/625

ఈ పుట ఆమోదించబడ్డది



అలరుదోటల విహరింప వలయు నీవు
ఘోరవనముల నేరీతి గుమ్మరిలెదు ?
కొదమచిలుకల పలుకుల బెదరు నీవు
పులుల బొబ్బల కేగతి నిలువఁ గలవు ?

రమణిమిన్నరొ ! నాదు ప్రాణములకన్న
నిన్నె మిన్నగఁ బ్రేమించుచున్న వాఁడ,
అట్టి నను వీడి నీ విప్పు డక్కటకట !
నట్టడవి కేగ నీ మన సెట్టు లొప్పె ?'

హృదయమున నించు కేనియు బెదరు లేక,
ఠీవిమై నిల్చి బదు లిడె పూవుఁబోడి
‘ధరణిపతివారసుడ వీవు, దాసి నేను.
ఎట్టు లొ నగూడు ననురాగ మిట్టి మనకు ?'

“ఎట్టెటూ ! చిట్టిదాసిరొ ! ఇట్టు రావె !
ఇన్ని వగ లెందు నేర్చితే వన్నెలాడి
ఈవు దాసివ? అట్ల గునేని, నేను
ముగుద దాసానుదాసుఁడ నగుదుఁ గాదె !

70