పుట:మధుర గీతికలు.pdf/624

ఈ పుట ఆమోదించబడ్డది


'సరళ ! వల దమ్మ యంతటి సాహసంబు,
ప్రేమతో నీవు వానిని పెండ్లి యాడ,
వాని రాజ్యము వానిదే యౌను గాదె!
ఇట్టి తెగువకుఁ బూనంగ నేటి కమ్మ!'

జనని కంతట కడసారి ప్రణతు లొసఁగి,
ఒక్కటొకటిగ తొడవుల నూడఁబెఱికి,
నారచీరల ధరియించి, యూరు విడిచి,
విపినసీమల కరుగంగ వెడలె సరళ.

తేరిపై నెక్కి మెల్ల నా దారిఁ జనుచు,
తరుణి నల్లనఁ గాంచి సుధాకరుండు
వెఱఁగుపాటును నివ్వెర పెనగొనంగ,
దిగ్గు రని తేరిపై నుండి డిగ్గి' అనియె.

'బాల! ఇది యేమి నిఱుపేదరాలి వోలె,
ఒంటిమై కాననంబుల వెంట రేయి
ఏల తిరిగెద వీలీల బేల వగుచు,
సరస మృదువాణి : అలివేణి సరళరాణి !

69