పుట:మధుర గీతికలు.pdf/622

ఈ పుట ఆమోదించబడ్డది


అఖిల లక్షణ శుభ శోభనాంగి వీవు,
చారు సుకుమార సుందరాకారుఁ డతఁడు-
అన్ని విధముల ననురూపు లైన మీకు
సఖ్య మొనగూర్చి నలువ తా చతురుఁ డయ్యె.

ఇంతకాలమునుండి నా హృదయమందు
దాచియున్న రహస్యంబు తల్లి : నీకు
తెలుపవలసిన తరుణంబు కలిగే నేఁడు,
కాన తెలిపెద - 'రాణివి కావు నీవు!'
-
అనుడు వెడవెడ నవ్వుచు, ననియె సరళ :
'ఇట్టు లాడఁగ నీకు నో రెట్టు వచ్చె ?
నేను రాణిని గానంచు నీవు పలుక,
ఎవ్వరైనను విన్నచో నవ్వ రొక్కొ!'

“అట్టు లైన వచించెద, నమ్మ వినుము-
వృద్ధభూపతి యవసానవేళ, తనదు
అనుఁగు తనయను నాపాలి కప్పగించి,
ఇట్టు వచియించె కనికర ముట్టిపడఁగ.

67