పుట:మధుర గీతికలు.pdf/621

ఈ పుట ఆమోదించబడ్డది



అంతిపురినుండి యరుదెంచి యామెదాసి,
విలువ నగలుసు సన్నని వలిపములును
గాంచి 'ఈ కాన్క లెవ్వ రంపించినారు?'
అనుడు, చిరునవ్వు నవ్వుచు ననియె రాణి:

'ఇంతమాత్రమె దాసీరో: ఎఱుఁగలేవె!
నాదు చిన్నారి పొన్నారి ననుపుకాఁడు,
అనుఁగు మేన త్తకొడుకు, సుధాకరుండు-
అతడుఁ తక్క మఱింకెవ్వ రంపువారు?'

హర్షమున పొంగి పొరలుచు ననియె దాసి:
"శీఘ్రమే మీకు కల్యాణసిద్ధి రస్తు!
ఈశ్వరుఁడు మీకు శుభముల నిచ్చుఁ గాక!
చల్లఁగా వేయియేండ్లు వర్థిల్లుఁ డమ్మ!

చెలువు గలవాఁడు, చిఱునవ్వు గులుకువాఁడు
హొయలు గలవాఁడు, మవ్వంపు వయసుకాఁడు,
ఇవ్వి యన్నియు నటు లుండనిచ్చి - నీదు
చిఱుతపాయమునాఁటి నెచ్చెలిమికాఁడు.

66