పుట:మధుర గీతికలు.pdf/620

ఈ పుట ఆమోదించబడ్డది

కే ర ళ రా ణి



చల్ల వగు నొక్క యామని సంజవేళ,
విరుల పొదరింట కమ్మ తెమ్మరలు వీవ,
చలువరాతిన్నె పై నొక్క తలిరుఁబోఁడి
ఇంపు మీఱఁగ వీణ వాయించుచుండె.

‘జయము జయము_కేరళరాణి! సరళ రాణి!
ప్రేమమై నీదు ప్రియుడుఁ పంపించినట్టి
పెండ్లి కానుక లివె-వీని స్వీకరింపు'
మనుచు నొక దూతి యందిచ్చి యవలఁ జనియె.

'నాదు రాజ్యము, పదవియు, నా ధనంబు,
నాదు వంశము నాసించి కాదు - నాదు
వరగుణంబుల మది మెచ్చి వలచె నతఁడు'
అనుచుఁదనలోనఁ దా ననుకొనియె రాణి.

65