పుట:మధుర గీతికలు.pdf/617

ఈ పుట ఆమోదించబడ్డది



ఇట్టు అవతరించిన యీశు నెదుటఁ గాంచి,
వ్యాఘ్రమును గోవు భక్తిసంభ్రమము లెసఁగ
స్తుతు లొనర్చిరి, దాని కీశుండు మెచ్చి
కరుణతో నిచ్చె వారికి పరమపదము.

బుద్ధి చాలని మూర్ఖుని పుడమియందు
పశు వటంచును పిలుతు, రా పశువ కాదె
నిత్యసత్యవ్రతంబును నిర్వహించి
ప్రవిమలానందపదవిని బడయఁ గలిగె.