పుట:మధుర గీతికలు.pdf/616

ఈ పుట ఆమోదించబడ్డది



అకట ! సడికంటే చావు మే లగును గాన,
చారుతరలీల నీకు నాహార మగుచు
కాయ మర్పించుటో, అట్లు గాకయున్న
జీవముల బల్మిఁ దొరఁగుటో చేయుదాన.'

అనుచు పులిఁ జేరి 'తిను' మంచు నావు పెనఁగ,
నీకు మొక్కెద నా జోలి రాకు మమ్మ,.
తినను తిన' నంచు బెబ్బులి పెనఁగ, నిట్లు
జరగె వాదము వారికి చాల సేపు.

అంత ఖేచరు లద్భుత మంది, గోవు
సత్యవాక్శుద్ధి పులికృపాసక్త బుద్ధి
చాల మెచ్చుచు నంతరిక్షముననుండి
కుసుమవర్షంబు వారిపై కురిసి రొగిని.

మొలను పులితోలు పచ్చడంబును ధరించి,
వృషభరాజంబుపై నెక్కి వేడు కలర
నంత నీశ్వరుఁ డచట ప్రత్యక్ష మయ్యె
వ్యాఘ్ర ధేనూ త్తమంబుల వాద ముడుప

61