పుట:మధుర గీతికలు.pdf/614

ఈ పుట ఆమోదించబడ్డది


అంత నీరీతి పులితోడ ననియె సురభి :
‘కాదొ యాఁకలి ? నామీఁద కాంక్ష లేదొ
నాదు మాంసము వాచవి గాదొ? యిట్లు
దెసలు జూచెద వేటికి తెల్లబోయి ?

ఆఁకటను స్రుక్కి వాడివత్తయ్యె నొడలు.
కడుపు వీఁపున నంటె నప్పడము వోలె;
జాల మేటికి ? నాదు మాంసమ్ము మెసవి,
పుణ్యలోకంబులకు నన్ను బుచ్చ వయ్య.

ఆవు గావించు తెగువకు నదరిపడుచు
ఎట్టకేలకు శార్దూల మిట్టు అనియె,
'పుడమిపై నేను పులి నయి పుట్టి పెరిగి
యిట్టి ధీరత గంటినే యెన్నఁ డైన ?

అకట! 'నీయట్టి మహితాత్ము లై నవారిఁ
బట్టి వధియించి దురితంబు గట్టికొనుట
కంటె, లొడితెడు పొట్టకై కాయ గసరు
మెసవి మునివృత్తి మసలుట మేలు కాదె?

59