పుట:మధుర గీతికలు.pdf/611

ఈ పుట ఆమోదించబడ్డది



అనుచు నాత్మజశోకదావాగ్ని కీల
లాత్మవచనాంబువృష్టిచే నాఱఁజేసి
సత్వరంబున పులి యున్న చక్కి జేర
నరిగె గోరత్న, మంత నవ్వ్యాఘ్ర మచట.

'పాటి యున్నదె యెందైన పసరమునకు ?
బేలనై దాని మాటల బేలువడితి,
కేలఁ జిక్కిన యావును గోలుపోతి;
అకట నావంటి యంబేద యవనిఁ గలఁడె?

బళిర; తా నొక్క నిజమరిబలె నటించి,
పెక్కుబాసలు చేసి తప్పించుకొనియె;
అయినఁ గానిమ్ము - ఇంతలో నైన దేమి ?
ఎదుడువడ కున్నె యిది యింక నెన్నఁడేని ?

ఇంక నీసారి అయ్యది యెదురుపడిన,
ఒక్క పెట్టున దానిపై నుఱికి, మేను
వచ్చివండఱ చేసి, యా వెచ్చ నెహ్రు
గ్రోలకుండిన నింక నే క్రోలుపులినె?'

56