పుట:మధుర గీతికలు.pdf/609

ఈ పుట ఆమోదించబడ్డది



ఎటకుఁ బోయెదు ? నీవెంట నేనువత్తు,
గోవుదూడల నెడ సేయు కుమతి గలఁడె ?
నీవు లే కున్న నిముసంబు నిలువఁ జాలఁ
తల్లితోడిద లోకంబు పిల్లలకును.

పేర్మి న న్నింక నెవ్వరు పెంచువారు ?
వీఁక న న్నింక నెవ్వరు నాకువారు ?
కూర్మి న న్నింక నెవరు చన్గుడుపువారు ?
ఎందు బోయెదు న న్నొంటి నింట డించి ?'

కనుల జలజల బాష్పముల్ కాల్వ గట్ట
వత్స మీరితి తనతోడఁ బలుకుచుండ,
జల్లుజల్లని హృదయంబు జలదరింప
సూనుఁ గౌఁగిట గదియించి, సురభి యనియె.

'జాలి నీ లీల వాపోప నేల వత్స ?
పాఱుఁ డెవరికి న న్నీయఁ బాలువడఁడు,
విధినియోగంబుచే నేన వెడలుచుంటి'
అంచు జరిగిన దెల్ల విన్పించె, నంత.

54