పుట:మధుర గీతికలు.pdf/608

ఈ పుట ఆమోదించబడ్డది



నిన్ను బాయక చెంత నే నున్నయపుడె
ఒద్దికను నిన్ను ముద్దు సేయుదురు కాని,
అక్కటా ! నేను నినుబాసి యరిగినంత
లెక్కగొందురె నిన్నొక్క వక్కకైన?

తూఁడుకంటెను. పుప్పొడి ధూళికంటె,
తృణకణముకంటె, పులుఁగుల యీఁకకంటె,
బెండుకంటెను, మఱి దూదిపింజకంటె
చుల్క నగుఁ గాదె తలి లేని సుతుఁడు జగతి.

స్వామి యెపుడైన కినుకచే నేమి యన్న,
అల్కఁ జెందక, తలలోనినాల్క వగుచు
ఏను లేనట్టి కొద గాననీక మెలఁగి,
వెయ్యియేఁడులు వర్థిల్లు మయ్య కొడుక!'

తల్లి యీరీతి బోధింప తల్లడిల్లి,
దూడ యిట్లనె, ‘అమ్మ ! యి ట్లాడే దేమె ?
దాన మొసఁగెనో, అమ్మెనో తన తనూజ
కరణ మిచ్చెనొ, చెపుమ - భూసురుఁడు నిన్ను ?

43