పుట:మధుర గీతికలు.pdf/607

ఈ పుట ఆమోదించబడ్డది



తండ్రి యిఁకమీఁద నా మాట తలఁపఁ బోకు,
మమ్ము మఱవుము, సత్య మేమఱకు మయ్య:
మనల నిన్నాళ్ళు ప్రేమతో మనిచినట్టి
విప్రునానకు మాఱు గావింపఁ బోకు

ఒంటి నేగకు పొలముల. కింటికడకు
పొద్దు వాలకమున్నుగాఁ బోవు మయ్య;
కరులు ఖరములు తురగముల్ తిరుగుచోట
దారి కడ్డంబుగా నిల్చి తారఁబోకు.

నూతిదరులందు. లోతైన గోతులు దరి
నెట్టి పచ్చిక మొలచిన మెట్టఁ జనకు,
గుమురుగా నున్న కసవుజొంపముల నేని
మూరుకొనకుండ నెన్నఁడు ముట్టఁ బోకు.

పోటుపసరాల జోలికిఁ బోకు మెపుడు,
దుడుకుతొడుకుల పొదుఁగుల దూఁటఁ బోకు,
తెవులుగొంటులతోఁ గూడి తిరుగవలదు,
మొసలి మసలెడు మడువుల మూతి నిడకు,'

52