పుట:మధుర గీతికలు.pdf/606

ఈ పుట ఆమోదించబడ్డది



ఈడుదూడలు తమ తల్లు లేగు దేర
ఎదురుగా నేగ, తానును ముదము మీఱ
నేగి, తన మాతృహీనత యెఱుకపడఁగ,
చిత్తమున నెంత కుందునో చిన్నికూన?

ఏను తను బాసిపోవుట యెఱుఁగ కకట !
ఆడుచున్నాఁడు బిడ్డడు వేడు కలర
అచట బెబ్బులి యాఁకట కాఁగలేక
స్రుక్కి సోలుచు నను దూఱి సురిగె నేమొ ?

గడియ యేనియు నే నిట తడయ నగునె ?’
అనుచు ధేనువు తలపోసి, మనమునందు
నెట్టి కొనివచ్చు శోకంబుమట్టువఱచి
తనయునిం జేరి వానితో ననియె నిట్లు.

'అన్న! నవమాసములు మోసి నిన్ను గాంచి
చనవుమై పెంచుచుంటిని చన్ను గుడిపి,
నీవు జనియించి మూన్నాళ్ళు నిండ లేదు
నీకు నాకును చెల్లెనే నేడు ఋణము ?

51